టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడిగా పద్మాకర్రెడ్డి
విద్యారణ్యపురి : తెలంగాణ ప్రాంత ఉ పాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జిల్లాస్థాయి సమావే శం శుక్రవారం హన్మకొండలోని వివేకానంద నిలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీయూఎస్ జిల్లా కార్యవర్గం లోని సీనియర్ ఉపాధ్యక్షుడైన సల్లగొండ పద్మాకర్రెడ్డిని అడహక్ జిల్లా అధ్యక్షుడిగా నియమాకం చేసింది.
ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మాకర్రెడ్డి గతంలో వెంకటాపూర్ మండలం అధ్యక్షుడిగాను, జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన టీపీయూఎస్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ సంఘం శ్రేయస్సుకు, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, ఎం.మహేందర్, కె.వెంకటకృష్ణ, ఎ.శేఖర్, సీని యర్ నాయకులు పాల్గొన్నారు.