ఆంగ్ల విద్యలో ప్రగతి అభినందనీయం
గీసుకొండ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘వంద రోజుల్లో ఆంగ్ల విద్య’ అభినందనీయమని డీఈఓ విజయ్‌కుమార్ అన్నారు. కొమ్మా ల కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల ఆంగ్ల విద్య పురోగతిని శుక్రవారం ఆయన పరీక్షించారు.
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రాథమిక స్థారుులో ఎల్టా మాడ్యుల్ ప్రకారం ఉపాధ్యాయులు ఆంగ్ల విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. దీంతో భాషపై వారు పట్టు సాధిస్తారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం విద్యార్థులకు అనేక రాయితీలు కల్పించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జనార్దన్‌రెడ్డి, ఎల్టా అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, పాఠశాల హెచ్ఎం నారాయణస్వామి, పోగ్రాం ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి, ఆర్పీలు రవికుమార్, వంశీమోహన్, లక్ష్మణ్, సత్యం, 13 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.