వెలంపాడుపై పచ్చ డేగలు
ఏపీఐఐసీ భూవుులను సైతం వదలని తెలుగు తవుు్మళ్లు
వెలంపాడు రెవెన్యూలో 60 ఎకరాల ఆక్రవుణ
వాటి విలువ రూ.6 కోట్లు పైవూటే
అండగా రెవెన్యూ అధికారులు
శ్రీకాళహస్తి వుండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అంతేగాక ప్రభుత్వం పరిశ్రమల పేరుతో ఇక్కడ భారీ ఎత్తున భూసేకరణ చేపట్టింది. ఈ క్రమంలో అధికార పార్టీ నాయుకులు అప్పనంగా భూ పరిహారం పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ భూవుులను ఆక్రమించుకుని రెండేళ్లుగా తమ అనుభవంలో ఉన్నట్టు రెవెన్యూ అధికారుల సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. పార్టీ నాయుకులంతా ఏకమై రెండేసి ఎకరాల చొప్పున ఓ ప్రైవేటు సర్వేయుర్ సాయుంతో రాత్రికి రాత్రే సరిహద్దులు ఏర్పాటు చేసుకుని 60 ఎకరాలు పంచుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలం వున్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు రెవెన్యూ పరిధిలో 178, 185వ బ్లాక్లోనున్న 225 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏపీఐసీసీకి 150 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో ఏఐసీసీ మేనేజర్ ప్రతాప్, తహశీల్దార్‌తో కలిసి భూవుులను పరిశీలించి రికార్డులు కూడా సిద్ధం చేశారు. వెలంపాడు గ్రావూనికి చెందిన టీడీపీ నాయుకులు బ్లాక్ నంబర్ 178లో దావురాకుల గుంట నుంచి వూమిడిగుంటకు వెళ్లే దారిలో 30 ఎకరాలు, అదే బ్లాక్‌లో రేపల్లి కండ్రిగ చెరువు వద్ద 30 ఎకరాలపై కన్నేశారు. ప్రస్తుతం ఈ భూవుుల విలువ రూ.6 కోట్లు పైవూటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలిసినా వారం రోజుల నుంచి ఈ భూములను జేసీబీతో చదును చేస్తూ సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. దీనిని గమనించిన కొందరు స్థానికులు సంబంధిత అధికారులకు సవూచారం అందించినా వారు పట్టించుకోక పోవడంతో పలు అనువూనాలకు తావిస్తోంది. పరిశ్రవులు తీసుకొచ్చేలోపు చెట్టుపుట్ట కొట్టి భూసేకరణ బృందానికి తవు పేర్లను సూచించి పరిహారం డబ్బులు కాజేయూలని ప్రయత్నిసున్నారు.
రెవెన్యూ అధికారి అండతోనే
వెలంపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూవుుల్లోని 60 ఎకరాల్లో గుట్టుచప్పుడు కాకుండా చెట్లను తొలగించి అనుభవం కింద వూర్చివేస్తానని ఓ రెవెన్యూ అధికారి తెలుగు తవుు్మళ్లకు భరోసా ఇవ్వడంతో ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకు గాను వచ్చే పరిహారంలో ఇతనికి వాటా ఇచ్చేలా రహస్య ఒప్పందం కుదిరినట్లు సవూచారం.
గతేడాది నుంచే ప్రయత్నాలు
గతేడాది ఇవే భూవుులను ఆక్రమించేందుకు నాయకులు ప్రయుత్నించారు. దీనిపై సాక్షి దినపత్రికలో కథనాలు రావడంతో అప్పటి తహశీల్దార్ ఆక్రవుణలకు అడ్డుకట్ట వేశారు. నెలక్రితం ఆయన బదిలీ కావడం, భూసేకరణ ప్రక్రియు వేగవంతం కావడంతో తెలుగు నేతలు పరిహారం కోసం వురోసారి జిమ్మిక్కులు చేస్తున్నారు.