ఖైదీ నంబర్ 150!
చిరంజీవి ఇప్పుడు ఖైదీ. ఆశ్చర్యంగా ఉందా? రీల్ కోసం ఖైదీగా మారారాయన. చిరంజీవి తాజా చిత్రం షూటింగ్ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మంగళవారం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో చిత్రీకరించారు.
ఖైదీ వేషధారణలో ఉన్న చిరంజీవి పాల్గొనగా సీన్స్ తీశారు. జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు తీశారని సమాచారం. చిరు వేసుకున్న చొక్కాపై 150 అనే అంకెలు కనిపిస్తున్నాయి. బహుశా ఇది చిరంజీవికి 150వ చిత్రం కాబట్టి.. ఖైదీ నంబర్ 150 అని కేటాయించి ఉంటారేమో!