చర్లపల్లి జైలు వద్ద ఖైదీల స్టాల్
కుషాయిగూడ (హైదరాబాద్) : చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో సబ్బులు, ఫినాయిల్, కాటన్ వస్త్రాలు, కుర్చీలు, చెప్పుల స్టాండ్లను ఉంచి విక్రయిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు జైలు అధికారులు ఉత్పత్తుల విక్రయానికి పూనుకున్నారు. ములాఖత్ కోసం జైలుకు వచ్చే ఖైదీల బంధువులతో పాటు ఆ మార్గంలో వచ్చేవారు స్టాల్‌లోని వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.