జేబు దొంగ ప్రేమ
అతనో జేబు దొంగ. ఫ్రెండ్స్‌తో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు. సరదాగా సాగుతున్న అతని జీవితంలో అనుకోకుండా ఓ సమస్య వచ్చి పడు తుంది. ఆ సమస్య ఏంటి? దాన్నుంచి అతనెలా బయట పడ్డాడు?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ 420’. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ జంటగా ఎస్ఎస్ రవికుమార్ దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి గజ్జల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో యిన్‌ను చూడగానే ప్రేమలో పడతాడు హీరో. దొంగ అయిన అతని ప్రేమ ను ఆ అమ్మాయి ఒప్పు కుందా? లేదా? ఆ ప్రేమ ఎలాంటి మలుపు తిరిగిం దన్నది సస్పెన్స్. అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి శోభారాణి.