పెద్దాస్పత్రి తీరు మారేదెన్నడో..?
మంకమ్మతోట : కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో సరైన వైద్యసేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. సీజనల్ వ్యాధులను అరకట్టేందుకు చర్యలు చేపట్టకపోవడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రోగులు దేవుడిపైనే శారం వేశారు. ఆస్పత్రిలో 350 పడకలు ఉన్నప్పటికీ అందుకు సరపడా డాక్టర్లు, సిబ్బంది, వసతులు లేవు. ఆస్పత్రి బెడ్స్‌పై ఉపయోగించే రెగ్జిన్, బెడ్‌షీట్ వంటివి కూడా లేక ఇంటివద్ద నుంచి తెచ్చుకుంటున్నామని రోగులు చెప్పారు.
మందులు, పరీక్షలు అన్ని బయటికే రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల మొదటివారం వారంలో ఆస్పత్రిలో రోగులు పెద్దగా లేనప్పటికీ ఇటీవల ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సీజనల్ వ్యాధులతో బాధుపడుతున్నవారిలో పిల్లలే ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు. దోమకాటు వల్ల మలేరియా, టైపాయిడ్‌తోపాటు విషజ్వరాలతో బాధపడుతున్న వారిలో రక్తంలో ప్లేట్లేట్ కౌంట్ తగ్గిపోయి ఆస్పత్రిలో చేరుతున్నారు.
రక్తం అవసరం ఉన్నవారికి ఇవ్వకుండా డబ్బులు అడుగుతున్నారని, తమకు రక్తం ఇచ్చే వారు లేరని చెప్పినా పట్టించుకోవడం లేదని పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న ఓ బాలిక తల్లి కంటతడి పెట్టింది. ఆస్పత్రిలో ప్రతిరోజు వంద మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న పడకలు నిండిపోవడంతో, సీరియస్‌గా ఉన్న రోగులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిరి రిఫర్ చేస్తున్నారు. రోగులకు అత్యవసర సమయంలో కత్రిమ శ్వాసను అందించేందుకు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రెండు వెంటిలేటర్లు వినియోగించకుడానే మూలనపడ్డాయంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
- తన మనుమడు తొమ్మిది నెలల రోహాన్‌కు వారం రోజుల నుంచి జ్వరం వస్తోందని, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని, డాక్టర్లు మందులు, వైద్యపరీక్షలకు బయటకే రాస్తున్నారని కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన శాంతమ్మ కంటతడి పెట్టారు. తాము పేదవారిమని, బతుకుదెరువుకోసం వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నామని, అన్ని మందులు బయట కొనేందుకు డబ్బుల్లేవని ఆమె వాపోయూరు.
- తమ కూతురు కడుపులో శిశువు మృతి చెంది తల్లడిల్లుతున్నా డాక్టర్లు పట్టించుకోవడం లేదని, ఇక్కడినుంచి తీసుకెళ్లమంటున్నారని బాలమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మృతశిశువు నిన్న బయటికి వచ్చినప్పటికీ వ్యర్థాలు కడుపులోనే ఉండిపోయాయని, తన బిడ్డకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని ఆమె మొరపెట్టుకున్నారు.
- 200 పడకల ఆస్పత్రిని 350 పడకలుగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం అందుకు అవసమైన వైద్య సిబ్బందిని నియమించలేదు. కనీస సౌకర్యాలు కల్పిండాన్ని విస్మరించింది. ప్రస్తుతం ఈ ఆస్పత్రి సామర్థ్యాన్ని 500 పడకలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు వైద్యసిబ్బంది నియూమకం, వసతుల కల్పన విషయూన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. గత ఏడాదిన్నర కాలంలో సుమారు పదిసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్ ఆకస్మిక తనిఖీలతో హడావుడి చేయడం మినహా ఆస్పత్రి స్థితిగతులను పట్టించుకున్న పాపనపోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు.
నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమావేశమైన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గతేడాది కాలంగా జాడలేదు. పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ శనివారం సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈసారైన తూతూమంత్రంగా ముగించకుండా, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయూల్సిన అవసరముంది.
జెడ్పీ చైర్పర్సన్ ఆకస్మిక తనిఖీ
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పత్రిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ శుక్రవారం ఉదయం తనఖీ చేశారు. ముందుగా ఆస్పత్రి రిసెప్షన్ కౌంటర్ వద్ద వేచి ఉన్న సదరం క్యాంపు బాధితులను పలకరించారు. సదరం క్యాంపు కార్యాలయం సకాలంలో తెరువడం లేదని సర్టిఫికెట్ల కోసం వచ్చినవారు ఉమకు ఫిర్యాదు చేశారు. అనంతరం రిసెప్షన్ కౌంటర్లో ఇన్‌పేషెంట్ల సంఖ్యను చైర్పర్సన్ అడిగి తెలుసుకున్నారు. చైర్పర్సన్ ఆస్పత్రిని తనిఖీ చేస్తున్నారని తెలుసుకున్న వైద్యసిబ్బంది హడావుడిగా లోనికి పరుగులు తీశారు. చైర్పర్సన్ మేల్, ఫిమేల్ ఓపి గదులను పరిశీలిస్తే... మేల్ ఓపిలో సిబ్బంది ఎవరూ లేరు. డాక్టర్ సీట్లోనే కూర్చుండి రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. జూలై 25వ తేదీ వరకు మాత్రమే రోగులను పరీక్షలు చేసినట్లు, డాక్టర్ సేవలు అందించినట్లు రిజిస్టర్లో ఉండటాన్ని గమనించారు. అప్పుడే ఆస్పత్రికి వచ్చిన సూపరింటెండెంట్‌ను డాక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆమె ఏదో చెప్పేందుకు ప్రయత్నం చేయగా వారిస్తూ రిజిస్టర్ చూపించి ఇందులో పూర్తి వివరాలు ఎందుకు నమోదు చేయలేదని అడిగారు. పూర్తి వివరాలు తెలియచేస్తూ వివరణ ఇవ్వాలని ఆ రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం పిల్లల వార్డును ఆమె తనిఖీ చేసి సమస్యలను, అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బెడ్లపై బెడ్షీట్లకు బదులుగా రోగులు తెచ్చుకున్న దుప్పట్లు, శాలువాలు ఉండడం గమనించి వెంటనే మార్చాలని సూచించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని, వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని, పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు.
గంటసేపట్నుంచి ఉన్నా..
నాకు షుగర్ ఉంది. పరీక్ష చేసుకోవడానికి వచ్చిన. గంటల సేపటి నుంచి లైన్లో నిలబడి డాక్టర్ కోసం ఎదురుచూస్తున్న. ఎప్పుడు వచ్చినా గిట్ల నిలబడుటం మాత్రం తప్పుత లేదు. డాక్టర్లు టైంకు రావాలె. మాలాంటి ముసులోళ్లు ఎంతసేపని లైన్ల నిల్చుంటరు?
- ఈగ పోచయ్య, గోపాల్రావుపేట్
ముందుగా ఓపీ చూడాలి
రోగాలు, జ్వరాలతో ఎంతో మందిమి ఇక్కడికి వచ్చినం. కానీ డాక్టర్లు టైంకు రాకపాయే. గంట సేపటినుంచి ఉన్నం. డాక్టర్ గురించి అడిగితే వస్తడు.. ఉండండి అని అంటు న్నరు. పనులు వదిలేసి వస్తే గిట్ల ఇబ్బంది పెట్టుడు తగదు. డాక్టర్ ముందుగా ఓిపీ రోగులను చూసి వార్డుకు పోవాలే.
-షెహేర్ ఆలం. కశ్మీర్‌గడ్డ