హయర్ ఫ్రిజ్‌కు ఉత్తమ బ్రాండ్ అవార్డు
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హయర్ రూపొందించిన వినూత్నమైన ‘బాటమ్ మౌంటెడ్ ఫ్రిజ్’ 2015కు గాను ప్రోడక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది. 2006లో ప్రవేశపెట్టిన ఈ తరహా రిఫ్రిజిరేటర్లలో ఎప్పటికప్పుడు కొంగొత్త టెక్నాలజీలతో మరింతగా మెరుగుపరుస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. 1 టచ్ కంట్రోల్ ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్వర్టర్ కంప్రెషర్ టెక్నాలజీ, ఫోల్డబుల్ గ్లాస్ షెల్ఫులు మొదలైన ఫీచర్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది. దేశీయంగా 24 మార్కెట్లలో రీసెర్చ్ సంస్థ నీల్సన్ నిర్వహించిన ఈ సర్వేలో 18,000 మంది పాల్గొన్నారు.