మనసును పట్టే కంప్యూటర్
లండన్: మనమెపుడైనా బోర్గా ఫీల్ అవుతుంటే మనవాళ్లు ఏమయింది అని ప్రశ్నిస్తుంటారు కదా! మరి అదే పనిని కంప్యూటర్లు చేస్తే? మానవులు బోర్గా ఉంటే మన కంప్యూటర్లు ఇట్టే పట్టేస్తాయట! దీన్ని ససెక్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హ్యారీ విచెల్ ధ్రువీకరించారు. మనిషి ప్రదర్శించే చిన్న హావభావాలను కంప్యూటర్ ద్వారా కొలిచే కొత్త విధానాన్ని ఆయన రూపొందించారు. ఒక వ్యక్తి ఆసక్తిని కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా గణించవచ్చని హ్యారీ తెలిపారు.
ఈ ప్రయోగానికి 27 మంది పార్టిసిపెంట్ల ముఖ కదలికలను మూడు నిమిషాల కంప్యూటర్ సెసన్స్ ద్వారా గుర్తించినట్లు వివరించారు. అదే సమయంలో వారి కదలికలను గుర్తించడానికి వీడియో మోషన్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలిపారు. ఈ రెండు చర్యల ద్వారా 42 శాతం మంది తమ పనిలో బోర్ను ఫీల్ అవుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు.