20 మందికి ‘కమిషనర్లు’గా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో మేనేజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు గ్రేడ్– 3 మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని వివిధ పురపాలికల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేనేజర్లుగా పనిచేస్తున్న డి.జైత్రామ్, సీహెచ్.వేణు, ఎస్.రాజమల్లయ్య, జీ.శ్రీనివాసన్, ఎంఆర్.జైరాజ్, బి.గోపాల్, ఎం.దేవేందర్, ఎన్.వెంకట స్వామి, జి.స్వరూపారాణి, కె.జయంత్ కుమార్ రెడ్డి, పి.సుధీర్ సింగ్, ఎం.పూర్ణచందర్, ఎండీ అయాజ్, పి.భోగేశ్వర్లు, ఎ.జగదీశ్వర్ గౌడ్, కె.అమరేందర్ రెడ్డి, ఎన్.క్రిష్ణారెడ్డి, బి.సత్యనారాయణ రెడ్డి, ఎన్.వసంత, కె.మల్లయ్యలు గ్రేడ్– 3 మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి పొందారు. 21 మంది అధికారులకు గ్రేడ్– 3 మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతలు కల్పించాలనే ప్రతిపాదనలు ఏడాదిగా పెండింగ్లో ఉండగా, ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆమోదం తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారికి మినహా మిగిలిన 20 మందికి పదోన్నతి కల్పించారు.