Property portal
-
ఏఐతో రియల్ ఎస్టేట్ సేవలు..
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో సుమారు 5 లక్షల మంది ఉంటే, అందులో కేవలం 15 శాతం మంది మాత్రమే సాంకేతికతను, ఆన్లైన్ టూల్స్‌ను వినియోగిస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది దళారులపై ఆధారపడి ముందుకుసాగుతోంది. - సాక్షి, సిటీబ్యూరోఇందులో 80 నుంచి 85 శాతం వరకూ దళారులు మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడుతున్నారని రియల్ రంగ అధ్యయనాలు తెలిపాయి. ఈ తరుణంలో హైదరాబాద్ వంటి మహానగరాల్లో బ్రోకర్లు, గృహ కొనుగోలుదారులు, వ్యాపారులు ప్రధాన ఆస్తి పోర్టల్‌ను వినియోగించడం ఉత్తమమని మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన అమ్మకాల నెట్‌వర్క్‌తో, కన్సల్టెంట్లకు సీఆర్ఎమ్ పరిష్కారంగా ‘రీడ్ ప్రో’ (READPRO)ను ఆవిష్కరించామని సుధీర్ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత సీఆర్ఎమ్ వేదికగా ఈ ‘రీడ్ ప్రో’ రెండు వందలకు పైగా నగరాల్లో 95 వేల యాక్టివ్ బ్రోకర్ లైసెన్స్‌లను సాధించింది. రియల్–టైమ్ సేల్స్ ట్రాకింగ్, లీడ్ ఇంటిగ్రేషన్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ వంటి ఫీచర్లతో ఈ రీడ్ ప్రో డేటా, లీడ్ మేనేజ్మెంట్, లైవ్ టీమ్ అప్డేట్లు, రియల్–టైమ్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ డాష్‌బోర్డ్‌లు, కంపాస్ వంటి అధునాతన సాధనాల ద్వారా లీడ్ జనరేషన్లో 200% పెరుగుదలకు సహాయపడిందన్నారు.రెండు కోట్ల కస్టమర్లకు.. ఈ ఆస్తి పోర్టల్‌లో వెరిఫైడ్ లీడ్స్, సైట్ సందర్శనలతో పాటు.. రెండు కోట్లకు పైగా కస్టమర్లు, 15 లక్షల జాబితాలతో మ్యాజిక్ బ్రిక్స్ రియల్ ఎస్టేట్ పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. గృహ కొనుగోలు దారులు, దళారుల సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరచడంలో ‘రీడ్ ప్రో’ వంటి సేవలు అత్యవసరమని రీడ్ ప్రో వ్యవస్థాపకుడు అక్షయ్ సేథ్ పేర్కొన్నారు. -
నాణ్యమైన నిర్మాణాలకే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సదుపాయాలు లేకపోయినా ఫర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని సూచించింది. మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణ ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు. -
3-5 ఏళ్లలో కామన్ ఫ్లోర్ ఐపీఓ
ముంబై : బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రోపర్టీ పోర్టల్ కామన్‌ఫ్లోర్‌డాట్‌కామ్ 3-5 ఏళ్లలో ఐపీఓకు రానుంది. రెండేళ్లలో లాభాల బాట పడతామని కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన సుమిత్ జైన్ చెప్పారు. వ్యాపార విస్తరణ నిమిత్తం 3-5 ఏళ్లలో ఐపీఓకు వస్తామన్నారు. అయితే ఎంత మొత్తంలో నిధులు సమీకరించేదీ ఆయన వెల్లడించలేదు. ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోందని, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోందని, దీంతో ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ జోరుగా వృద్ధి సాగిస్తోందని జైన్ వివరించారు. కొత్త ఉత్పత్తులందించడం, టెక్నాలజీ, సమాచార సేకరణ... ఈ మూడు అంశాలపై భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నామని తెలిపారు. ఇటీవలనే సీఎఫ్ రెటినా (ప్రోపర్టీని వర్చువల్‌గా అనుభూతినిచ్చే), లివ్-ఇన్ టూర్స్(ప్రోపర్టీని పూర్తిగా వర్చువల్‌గా వీక్షించడం) సర్వీసులను ప్రారంభించామని తెలియజేశారు. లివ్-ఇన్ టూర్స్ ఫీచర్ కింద ప్రస్తుతం 15,000 ప్రోపర్టీలు ఉన్నాయని, ఆర్నెళ్లలో దీనిని ఐదు లక్షలకు పెంచనున్నామని పేర్కొన్నారు. తమ పోర్టల్‌లో 200 నగరాల్లోని కోటికి పైగా ప్రోపర్టీలు లిస్ట్ అయి ఉన్నాయని చెప్పారు.