పత్తి కొనుగోళ్లలో జాప్యంపై వైఎస్సార్సీపీ ఆందోళన
పత్తికొనుగోళ్లలో నెలకొన్న తీవ్రజాప్యం, దళారుల మోసాలపై వైఎస్సార్సీసీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డు నుసందర్శించిన వైఎస్సీర్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్.. పత్తి కొనుగోళ్లలో జాప్యం, మోసాలపై నేతలు ఆగ్రహం వ్యక్తచేశారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేయాలని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కెట్ యార్డు అధికారులను కోరారు. పరిస్థితిలో మార్పు రాకుంటే రైతుల పక్షాన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.