కల్వర్టు కోసం నిరసన
సంగం:
ముంబాయి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో భాగంగా సంగం మండలంలోని దువ్వూరు గ్రామం వద్ద కల్వర్టును నిర్మించాలని దళితులు ఆదివారం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. దువ్వూరు సమీపంలోని 719, 500 నెంబరు కలిగిన కల్వర్టును పెద్దది చేసి రోడ్డును నిర్మించుకోవాలని దళితులు నిరసన తెలిపారు. దళితుల నిరసనకు ఆ గ్రామ వైఎస్సార్ సీపీ నేత సూరి మదన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. అదే సమయంలో దువ్వూరుకు వస్తున్న ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డికి సూరి మదన్‌మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ దేవసహాయం పరిస్థితిని వివరించారు. దీంతో గౌతమ్‌రెడ్డి కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి బాబునాయుడుతో మాట్లాడారు. కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లి కల్వర్టు పెంపు మంజూరు తెస్తామని, అప్పటి వరకు కల్వర్టు వద్ద సిమెంటు రోడ్డు పనులను ఆపాలని గౌతమ్‌రెడ్డి సూచించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కల్వర్టు కోసం పంచాయతీ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపాలని గౌతమ్‌రెడ్డి కోరారు. నిరసన కార్యక్రమంతో నెల్లూరు ముంబాయి రోడ్డుపై వాహన రాకపోకలు స్తంభించడంతో బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై ఎల్ సుధాకర్‌రెడ్డి వచ్చి దళితులను సూరి మదన్‌మోహన్‌రెడ్డితో కంపెనీవారితో చర్చించారు. గౌతమ్‌రెడ్డి వచ్చి సమస్యను పరిష్కరించడంతో రాకపోకలను ఎస్సై సుధాకర్‌రెడ్డి పునరుద్ధరించారు.
14ఎటికె105: కాంట్రాక్టు ప్రతినిధులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి
కల్వర్టు, జాతీయ రహదారిపై నిరసన, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి