నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురు వారం నిరసనలు చేపడుతున్నట్లు రైతుసంఘం(సీపీఎం) నాయకులు జంగారెడ్డి, బొంతల చంద్రారెడ్డి తెలిపారు. రైతులు, నిర్వాసితులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలని కోరారు.
కేంద్ర చట్టం అమల్లో ఉన్నా ఆ చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా, బల వంతంగా భూములను సేకరించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడం అన్యాయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తోందని వ్యవసాయ కార్మికసంఘం(సీపీఎం) నాయకులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు విమర్శించారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వ్యవసాయ కార్మికులు, సేవకులుగా ఉన్న వృత్తిదారులు, బడుగు, బలహీనవర్గాల కౌలు రైతులను సీఎం కేసీఆర్ మరోసారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.