Puducherry Governor
-
కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి సర్కార్ బ్రేక్.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: విలాసవంతమైన నౌక కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పుదుచ్చేరిలో హాల్ట్‌కి నిరాకరించింది. క్రూయిజ్‌లో కేసీనో, గ్యాంబ్లింగ్ ఉండటంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. తెల్లవారు జామున 4 గంటల నుంచి షిప్ ఆగిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో క్రూయిజ్ ఆపరేట్లు చర్చలు జరుపుతున్నారు. పాండిచ్చేరి అనుమతించకపోతే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కడులూరు పోర్ట్‌లో నౌకను ఆపేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
గవర్నర్ ఫొటోకు క్షీరాభిషేకం
తిరువొత్తియూరు(పుదుచ్చేరి): ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అభివృద్ధి పనులకు ప్రోత్సాహం ఇస్తున్న గవర్నర్ కిరణ్‌బేడీ చర్యలకు మద్దతు తెలుపుతూ కొందరు అభిమానులు ఆమె ఫొటోను పాలతో అభిషేకించారు. గవర్నర్ చర్యలకు ఓ వైపు నుంచి మద్దతు, మరో వైపు నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఆమెతో తీవ్ర క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఆమెను హిట్లర్‌లా చిత్రీకరించిన బ్యానర్లతో వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం కలిగించింది. ఇందుకు జవాబుగా అన్నట్లు యానాంలోని ఆమె అభిమానులు దుకాణం వీధిలో కిరణ్‌బేడి ఫొటోకు క్షీరాభిషేకం చేసి మద్దతు తెలిపారు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది తెలుసుకున్న కిరణ్‌బేడీ ఇకపై అభివృద్ధి పనులకు ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.