పులిచింతల పవర్ ట్రయల్ రన్ ప్రారంభం
పులిచింతల ప్రాజెక్టు(మేళ్లచెర్వు): మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న 120 మోగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు మొదటి యూనిట్ మెకానికల్ స్పిన్నింగ్ ట్రయిల్ రన్‌ను సోమవారం హైడల్ డైరక్టర్ వెంకటరాజం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదిహేను రోజుల్లో మొదటి యూనిట్ ద్వారా 30 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. మరో యూనిట్‌ను సెప్టంబర్ చివరి నాటికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే మార్చి నాటికి నాలుగు యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన పులిచింతల ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వను పరిశీలించడంతో పాటు విద్యుత్ తయారికి కావల్సిన నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆయన వెంట సీఈ సివిల్ శివాజి, హైడల్ పవర్ కంపెనీ సీఈ మూర్తి, ఓఎస్డీ దివాకర్,హెపీసీ ఎస్ఈ వర్మ, ఎస్ఈ సద్గుణకుమార్, ఓఎస్డీ పూర్ణచందర్రావు, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.