Pulikesi sequel
-
పులికేసికి లైన్ క్లియర్?
తమిళసినిమా: ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రానికి లైన్‌క్లియర్ అయ్యిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేసి స్టార్ దర్శకుడు శంకర్ తన ఎస్.ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి.శంకర్ శిష్యు డు శింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో వడివేలుకు హీరోగా అవకాశాలు వచ్చేశాయి. అయితే ఆ తరువాత నటించిన చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. అదే సమయంలో రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న వడివేలు నటనకు దూరం అయ్యారు. చాలా గ్యాప్ తరువాత దర్శకుడు శంకర్ మరోసారి వడివేలుకు అవకాశం కల్పించి ఇంసై అరసన్‌కు సీక్వెల్‌గా ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయ్యారు. అయితే చిత్రం సగంలోనే ఆగిపోయింది. కారణం వడివేలు కాల్షీట్స్ కేటాయించకపోవడమే. దీంతో శంకర్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కొంత కాలంగా సాగుతూ వస్తోంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ వడివేలుతో సమావేశమై సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారు. అయినా వడివేలు తన కాల్షీట్స్ను ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర యూనిట్ సరిగా వాడుకోకుండా వృథా చేశారని, ఇంకా ఆ చిత్రానికి డేట్స్ కేటాయించలేనని చెప్పేశారు. తాను మళ్లీ ఆ చిత్రం చేయాలంటే అదనంగా పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో శంకర్ తరఫున తాము ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి కొంత భాగం చిత్రీకరించడంతో సుమారు రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు, ఆ మొత్తాన్ని వడివేలు తమకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని నిర్మాతల మండలిని కోరారు. ఇదే విషయాన్ని వడివేలుకు నిర్మాతల మండలి ఆదేసించింది. ఇలాంటి పరిస్థితుల్లో వడివేలు ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని పూర్తి చేసే తీరాల్సిన పరిస్థితి నెలకొందని సినీ వర్గాల సమాచారం. అదే విధంగా ఆయన చిత్రం చేయడానికి ఒప్పుకున్నట్లు తాజా టాక్. ఇదే గనుక నిజం అయితే ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి త్వరలోనే మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందన్నమాట. -
వడివేలు మొండిపట్టు
సాక్షి సినిమా:ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రానికి వడివేలు మొండికేశారు. హాస్యనటుడిగా ఉన్న వడివేలు ఇంసైఆరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి శంకర్ నిర్మాత. శింబుదేవన్ దర్శకుడు. ఆ చిత్రం విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌ను ప్రారంభించారు. అయితే కొంత షూటింగ్ జరిగిన తరువాత చిత్రానికి సమస్యలు వడివేలు రూపంలో మొదలయ్యాయి. శంకర్ వడివేలుపై నిర్మాతల మండలిలో, దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ ఫిర్యాదు చేశారు. ఆ సంఘాలు విడివేలు వివరణ కోరుతూ లేఖలు పంపాయి. తాజాగా వడివేలు నటీనటుల సంఘానికి బదులు లేఖ రాశారు. అందులో.. తాను పులికేసి చిత్రంలో నటించడానికి 1–6–2016లో ఒప్పుకున్నానన్నారు. 2016 డిసెంబరు లోగా చిత్రాన్ని పూర్తి చేస్తామని, అప్పటివరకూ ఇతర చిత్రాల్లో నటించరాదని తనతో చెప్పారన్నారు. అయితే నిర్ణీత గడువులోగా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో తాను పలుసార్లు కాల్షీట్స్ ఇచ్చి పులకేశి చిత్రంలో నటించానని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తన కాస్ట్యూమర్ ఎస్.ప్రకాశ్‌ను సంస్థ నుంచి తొలగించారని ఆరోపించారు. నిర్ణీత గడువు పూర్తయిన తర్వాత దురుద్దేశంతోనే తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ చిత్రంలో నటిస్తే తాను అంగీకరించిన పలు చిత్రాలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ వివరణపై నటీనటుల సంఘం, నిర్మాతల సంఘం వడివేలు లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి. -
పులికేశి సీక్వెల్‌కు సిద్ధం
తమిళసినిమా; హాస్య నటుడు వడివేలు కథానాయకుడిగా మార్చిన చిత్రం ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు శంకర్ తన ఎస్.పిక్చర్స్ పతాకంపై నిర్మించి శిష్యుడు శింబుదేవన్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత వడివేలు నటించిన ఏ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆయన కూడా ఆ తరువాత మళ్లీ హాస్య పాత్రలు పోషించడానికి సుముఖం వ్యక్తం చేయలేదు. తాజాగా విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న కత్తి సండై చిత్రంలో హాస్యభూమికను పోషించడానికి అంగీకరించారు. కాగా తనను హీరోగా చేసిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రానికి సీక్వెల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారని తాజా సమాచారం. దీనికీ శింబుదేవన్ దర్శకత్వం వహించనున్నారు. సీక్వెల్ చిత్రం అయినా ఈ దర్శకుడిని ఆదుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఆ తరువాత శింబుదేవన్ చేసిన ఇరుంబు కోట్లై మోరట్టు సింగం,విజయ్ హీరోగా ఇటీవల చేసిన పులి చిత్రం నిరాశపరిచాయి. ఈ చిత్రాన్ని చాలా కాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న దర్శకుడు శంకర్ ఎస్.పిక్చర్స్ సంస్థ ప్రస్తుతం రజనీకాంత్‌తో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ఫిలింస్‌తో కలిసి భారీ ఎత్తున్న నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని లైకా సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం ఇటీవల స్పష్టం చేశారు. అయితే 2.ఓ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత వడివేలు పులికేసి సీక్వెల్ చిత్రం గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.