అక్క గొంతు కోసిన తమ్ముడు
ఒంగోలు: తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ తమ్ముడు సొంత అక్క గొంతు కోశాడు. ఒంగోలులోని పులివెంకటరెడ్డి కాలనీలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు రాణి కొంతకాలం క్రితం పెద్దల అభీష్టానికి ఇమ్మానుయల్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు అనకాపల్లి పారిపోయి పెళ్లిచేసుకున్నారు.
తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ ఒంగోలు టుటౌన్ పోలీసు స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. కుటుంబ పరువు తీసిందని అక్కపై కోపం పెంచుకున్న రాణి తమ్ముడు రాము తన స్నేహితులతో కలిసి ఆమె గొంతు కోశాడు. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.