తిరువళ్లూరులో మరో జలాశయం
కొరుక్కుపేట: చెన్నై నగరంలో ఓ వైపు విద్యుత్ కష్టాలు విలయతాండం చేస్తుంటే మరో వైపు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందుఆల ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చెన్నై నగర వాసుల తాగునీటి కొరతను తీర్చే విధంగా ప్రభుత్వం మరో కొత్త రిజర్వాయర్ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణను సైతం ప్రారంభించింది. చెన్నై నగరానికి సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే పూండి రిజర్వాయర్ ఉండగా, దీని నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తిరువళ్లూరు జిల్లా రిజర్వాయర్ నిర్మాణానికి అనువైనదిగా గుర్తిం చగా, 90 శాతం భూసేకరణ పనులను సైతం అధికారులు సిద్ధం చేశారు. *330 కోట్లతో వాటర్ రిసోర్సెస్ విభా గం ఈ పనులను చేపట్టనుంది.
తిరువళ్లూరు జిల్లాలోని కన్నన్కోటై గ్రామం, తెరవైకండిగై ప్రాంతాల మధ్య ఈ రిజ ర్వాయర్ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. 500 క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేసి సామర్థ్యంతో ఈ రిజ ర్వాయర్ను నిర్మించనున్నారు. ఇందు లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణానికి 1500 ఎకరాల భూమి అవసరం కాగా, 1350 ఎకరాల భూసేకరణ పనులను పూర్తి చేశారు. ఈ విషయంగా డబ్ల్యూఆర్చగ అధికారులు మాట్లాడుతూ చెన్నై మహానగర పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పూండి జలాశయం సహా నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. వీటితో పాటు అదనంగా ఐదో రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే చెన్నై నగర ప్రజలు తాగునీటి కష్టాలు పూర్తిగా సమసిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రిజర్వాయర్ 2015 ఏడాది మధ్య నాటికి అందుబాటులోకి రానుం దని వెల్లడించారు.