Pune police commissioner
-
కరోనాపై ప్రాంక్ చేయండి: పుణె సీపీ
సాక్షి, పుణె: ఏప్రిల్ ఫూల్ డే సందర్భంగా సోషల్‌మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే పుణె పోలీస్ కమీషనర్ వెంకటేశం ట్విటర్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పొరాడుతున్నందున ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి కోవిడ్-19ను అంతమెందించే నాలుగు సూత్రాలను పాటిచాలని కోరుతూ నాలుగు ఫోటోలను జత చేశారు. ఏప్రిల్ ఫూల్ రోజు నెటిజన్లంతా కరోనాపై ప్రాంక్ చేసి దాన్ని తరిమికొట్టాలని పేర్కొన్నారు. ‘ఇంట్లోనే ఉండండి, చేతులను తరుచుగా శుభ్రం చేసుకోండి, అవసరమైతే తప్పా బయటికి వెళ్లకండి, అవాస్తవ ప్రచారం చేయకండి’ అంటూ కమిషనర్ వెంకటేశం ట్వీట్ చేశారు. నెటిజన్ల నుంచి ఈ ట్వీట్ కి మంచి స్పందన లభిస్తోంది. మేం కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాం సర్ అంటూ చాలామంది రీ ట్వీట్ చేస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్: సీఎం వేతనం కట్!) -
నరేంద్ర దబోల్కర్ హత్య కేసు ఛేదిస్తాం
మూఢనమ్మకాలు, దురాచారాల నిర్మూలనకు రాజీలేని పోరాటం సాగిస్తూ దారుణ హత్యకు గురైన ప్రముఖ హేతువాద నాయకుడు నరేంద్ర దబోల్కర్ కేసు సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తామని పూనే పోలీసు కమిషనర్ గులాబ్‌రావు పోల్ ధీమా వ్యక్తం చేశారు.ఆయన హత్యకు పాల్పడిన నిందితుల కోసం క్రైం బ్రాంచ్ పోలీసులు తమ చర్యలను ముమ్మరం చేశారని తెలిపారు. నిందితుల సంబంధించి సీసీకెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఫుట్ ఇమేజ్‌లలో వారి ముఖ కవళికలు సరిగా లేవని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పూనే గ్రామీణ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించారు. అలాగే అహ్మద్‌నగర్‌లోని శ్రీరాంపూర్ తాలుకాలో మరో ఇద్దరిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ఆయన తెలిపారు. గత నెల ఆగస్టు 21న పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయ సమీపాన ఉన్న వంతెనపై ఉదయం 7.30 గంటలకు మార్నింగ్‌వాక్ చేసి వస్తుండగా ఆయనపై ఆగంతకులు కాల్పులు జరిపారు.స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దబోల్కర్ ససూన్ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే దబోల్కర్ మరణించారని వైద్యులు వెల్లడించారు.ఆ ఘటనపై కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.