బాబును ఎవరుకాపాడలేరు
– సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలి
– వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను డిమాండ్
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు) :
‘ఓటుకు కోట్లు’ కేసులో నిండా మునిగిన సీఎం చంద్రబాబుకు శిక్ష పడకుండా ఎవరూ కాపాడలేరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. అనిగండ్లపాడులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ శాసనమండలి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన వ్యవహారమంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని ఏసీబీ చార్జీషీటులో పేర్కొందన్నారు. ముఖ్యమంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు మరెవరినైనా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నారు. రెయిన్గన్ల ఏర్పాటుకు రూ.150 కోట్లు కేటాయిస్తున్నామని చెబుతున్నారని, దీనిల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. రెయిన్ గన్ల వల్ల రైతులకు సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కనకపూడి ప్రియాంక, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంజం కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటాచలం పాల్గొన్నారు.