Puri beach
-
బీచ్‌లో స్నానం.. అంతలోనే తండ్రిని మింగేసిన అల..
భువనేశ్వర్: పూరీ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రపు స్నానం ఓ బాలుడికి తండ్రిని దూరం చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పూరీలో చోటు చేసుకుంది. బాలాసోర్‌కు చెందిన బన్సిధర్ బెహెరా(35) కుటుంబసభ్యులతో కలసి వేసవి టూర్ కోసం పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. శనివారం తండ్రీకొడుకులు సరదాగా బీచ్‌లోకి దిగి.. ఆడుతుపాడుతూ స్నానం చేశారు. అలా వారు స్నానం చెస్తూ.. సముద్రపు ఓ పెద్ద అల వైపు బన్సిధర్ బెహెరా దూకాడు. దీంతో ఆ పెద్ద అల వారిని అతలాకుతలం చేసింది. అల నుంచి బన్సిధర్ బెహెరా తిరిగి రాలేదు. 12 ఏళ్ల అతని కొడుకు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అతని కుటుంబసభ్యులు అప్రమత్తమైనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతని మృతదేహం కోసం డైవర్లు, ఫైర్ సిబ్బంది సముద్రంలో వెతుకుతున్నారు. సముద్రంలోకి దిగి స్నానం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడకు వచ్చే పర్యటకులకు చెబుతామని పూరీ బీచ్ పోలీసులు తెలిపారు. అయితే కొంతమంది తాము చెప్పే సూచనలు నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. దాని వల్లే ఇలాంటి ప్రమాదలు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఘటనను కుటుంబసభ్యుల్లో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బన్సిధర్ బెహెరా బాలాసోర్‌లో చిరు వ్యాపారిగా పనిచేస్తున్నారు. -
పూరి తీరంలో సైకత అద్భుతం!
సాక్షి, న్యూఢిల్లీ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ భువనేశ్వర్‌లోని పూరి తీరంలో ఇసుకతో బుద్ధుని ప్రతిమను తయారు చేశారు. ‘ప్రపంచ శాంతిని కోరుతూ బోది చెట్టు కింద ప్రార్థన చేస్తున్న బుద్ధుడు’ సైకత శిల్పం ఫోటోలను పట్నాయక్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బుద్ధుని ఆశిస్సులతో ప్రపంచమంతా శాంతితో నిండిపోవాలని కాంక్షించారు. ‘అందరికీ హృదయపూర్వక బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు’ అంటూ పట్నాయక్ బుద్ధ జయంతి సందర్భంగా గతంలో బెర్లిన్, జపాన్ సముద్ర తీరాల్లో తయారు చేసిన బుద్ధుని మంచు ప్రతిమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వైశాఖ పూర్ణిమ రోజున జన్మించిన సిద్ధార్థుడు తన బోధనలతో, చేతలతో.. మనిషి దుఃఖానికి కారణమైన కోరికలను త్యజించి శాంతియుత జీవనాన్ని గడపాలని చాటిచెప్పారు. కాగా, బుద్ధుని జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ మతస్తులు ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. My heartiest wish to all a Blessed and Peaceful life on #BuddhaPurnima. One of my SandArts pic.twitter.com/jFSDVhJl4Q — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 #BuddhaPurnima : "Bring Peace to all". Wishing Everyone Blessed & peaceful life. One of my SandArts at Berlin in 2013 . pic.twitter.com/k6UDJsn2c6 — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 #BuddhaPurnima : "Bring Peace to all". Wishing Everyone Blessed & peaceful life. One of my Snow sculpture at Japan in 2007 . pic.twitter.com/JxtDKJWqvj — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 -
పూరీ తీరంలో సింధు సైకతశిల్పం
భువనేశ్వర్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత బ్యాడ్మిటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను అభినందిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చక్కటి శిల్పాన్ని తయారుచేశారు. ఒడిశాలో పూరీ సముద్రతీరంలో ఐదు అడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇంగ్లీష్‌లో కంగ్రాట్స్ పీవీ సింధు, థ్యాంక్స్ గోపీచంద్ అనే అక్షరాలతో పాటు బ్యాడ్మింటన్ ఆడుతున్నట్టుగా సింధు ప్రతిమ ఉంది. సుదర్శన్ పట్నాయక్ ఈ శిల్పం తయారు చేయడానికి నాలుగు టన్నుల ఇసుకను వాడారు. ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించడాన్ని దేశం గర్విస్తోందని, ఆమె విజయం వెనుక కోచ్ గోపీచంద్ ఉన్నాడని ప్రశంసించారు. సమాజంలో ఆయా పరిస్థితులకు, పరిణామాలకు సందర్భోచితంగా విలక్షణ శైలిలో సైకత శిల్పాలను రూపొందించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత. -
డెంగీ టెర్రర్ పూరీ బీచలో అవిష్కరణ