పూరీకి 150 కి.మీ దూరంలో వాయుగుండం
విశాఖపట్నం: పూరీకి దక్షిణ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. గోపాల్పూర్ - పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కోస్తా ప్రాంతాల్లో మరో రెండురోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. అయితే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కృష్ణపట్నం, నిజాపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు
ఉన్నతాధికారులు హెచ్చరించారు.