డై..లాగి కొడితే....
సినిమా : శివమణి
రచన: కోన వెంకట్ దర్శకత్వం: పూరీ జగన్నాథ్
వైజాగ్ ఎంత ఫేమస్సో అక్కడి పూర్ణా మార్కెట్ కూడా అంతే ఫేమస్. ఆ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా శివమణి (నాగార్జున) బాధ్యతలు తీసుకుంటాడు. ఆ వెంటనే సిటీలోని రౌడీలు, గూండాలందర్నీ మార్కెట్‌కి
పిలిపిస్తాడు.
‘నా పేరు శివమణి..
నాకు కొంచెం మెంటల్
పూర్ణామార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని’.. ఇప్పటి వరకూ ఎవరు ఏం చేశారని నేను అడగా.. కానీ, అన్నీ ఆపేయండి. సడన్‌గా నేనొచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి, మానడానికి ట్రై చేయండి’ అని చెబుతాడు. నాగ్ పలికిన ఆ డైలాగ్ అప్పటికీ.. ఇప్పటికీ పాపులరే.