కేజ్రీవాల్‌కు నల్లజెండాలతో నిరసన
ఫరీదాబాద్: హర్యానా పర్యటనలో భాగంగా ఫరీదాబాద్‌లో శుక్రవారం రోడ్‌షో నిర్వహిం చిన అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురయింది. స్థానికులు కొందరు ఆయనకు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఫరీదాబాద్ లోక్‌సభ అభ్యర్థి పురుషోత్తమ్ డగర్తోపాటు కేజ్రీవాల్ సెక్టార్ 37 మార్కెట్ నుంచి రోడ్డు షో మొదలుపెట్టారు. ఏ పార్టీకి చెందబోమని ప్రకటించుకున్న కొందరు స్థానికులు నల్లజెండాలు చూపుతూ కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలు చేశారు.
రాజకీయ పార్టీలు ప్రత్యర్థులకు నల్లజెండాలు చూపడం సహజమని, దేశాన్ని సమర్థంగా పాలించగల శక్తి కేజ్రీవాల్ ఒక్కరికే ఉం దని ఆప్ స్థానిక నాయకుడు ఒకరు అన్నారు. కేజ్రీవాల్ రెండు రోజులపాటు గుర్గావ్, ఫరీదాబాద్‌లో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఇవి చందావలి, దయాల్పూర్, చేన్సా, మోహ్నా,అల్వాల్పూర్ మీదుగా సాగి నుహ్ వద్ద శనివారం రాత్రి ముగుశాయి. గుర్గావ్లో ఆదివారం కేజ్రీవాల్ రోడ్‌షోలు కొనసాగుతాయి.