పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన రైల్వే జి.ఎం
విజయవాడ (రైల్వేస్టేçÙన్) :
కృష్ణా పుష్కరాలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు తరలి రానున్న నేపథ్యంలో విజయవాడ స్టేషన్లో చేసిన ఏర్పాట్లను రైల్వే జి.ఎం కె.రవీంద్రగుప్తా బుధవారం పరిశీలించారు. పార్శిల్ కార్యాలయం, తారాపేట టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన పుష్కర నగర్లను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల వసతి, తాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డి.ఆర్.ఎం అశోక్‌కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావు, సీనియర్ డీ.సి.ఎం షిఫాలి, ఇన్చార్జ్ పి.ఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్, స్టేషన్‌మేనేజర్ సి.హెచ్.సురేష్‌లు పాల్గొన్నారు.