pushkara contractors
-
ఆందోళనకు సిద్ధమవుతున్న పుష్కర కాంట్రాక్టర్లు
నరసాపురం : పనులు పూర్తి చేసి ఏడాది అయినా ప్రభుత్వం నుంచి సొమ్ములు రాకపోవడంతో పుష్కర పనుల కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నరసాపురం పురపాలక సంఘంలో పుష్కర పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు శుక్రవారం మునిసిపల్ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. ముందుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేకుకుని కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్‌ను కలిసి సమస్య వివరించారు. పుష్కరాల సమయంలో అప్పులు చేసి, పనులు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నరసాపురంలో జరిగిన పుష్కరాల పనులు మెచ్చుకున్నారని అయితే, సొమ్ములు మాత్రం ఇవ్వలేదన్నారు. మునిసిపాలిటీలో రూ. 27 కోట్లు పనులు పూర్తి చేశామని, ఇంకా రూ.7 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బకాయిల విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లు గుత్తుల సత్యనారాయణ, కోటిపల్లి దొరయ్య, అందే కృష్ణకిషోర్, గుగ్గిలపు శివరామకృష్ణ, కంబాల మామజీ, అడబాల బాబు పాల్గొన్నారు. నేటి నుంచి రిలే దీక్షలకు సన్నాహాలు 14 నెలలుగా సొమ్ములు ఇవ్వకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందరని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ‘కానీ కానీ అన్నారు.. కాసుల ఊసు మరిచారు’ శీర్షికన ఈ నెల 15న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని కాంట్రాక్టర్లు మునిసిపల్ కమిషనర్ పి.రమేష్, ఇతర అధికారులకు చూపించారు. మా కష్టాలు ఇలా ఉన్నాయి.. చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సొమ్ములు వచ్చే వరకూ ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. మునిసిపల్ కార్యాలయం వద్ద శనివారం నుంచి రిలే దీక్షలు చేస్తామని అనుమతి ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. కాంట్రాక్టర్లు మాట్లాడుతూ సొమ్ములు ఇచ్చే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సరైన సమాధానం రావడంలేదని, శనివారం నుంచి ఆందోళనకు దిగుతామని చెప్పారు. -
ఆందోళనకు సిద్ధమవుతున్న పుష్కర కాంట్రాక్టర్లు
నరసాపురం : పనులు పూర్తి చేసి ఏడాది అయినా ప్రభుత్వం నుంచి సొమ్ములు రాకపోవడంతో పుష్కర పనుల కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నరసాపురం పురపాలక సంఘంలో పుష్కర పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు శుక్రవారం మునిసిపల్ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. ముందుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేకుకుని కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్‌ను కలిసి సమస్య వివరించారు. పుష్కరాల సమయంలో అప్పులు చేసి, పనులు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నరసాపురంలో జరిగిన పుష్కరాల పనులు మెచ్చుకున్నారని అయితే, సొమ్ములు మాత్రం ఇవ్వలేదన్నారు. మునిసిపాలిటీలో రూ. 27 కోట్లు పనులు పూర్తి చేశామని, ఇంకా రూ.7 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బకాయిల విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లు గుత్తుల సత్యనారాయణ, కోటిపల్లి దొరయ్య, అందే కృష్ణకిషోర్, గుగ్గిలపు శివరామకృష్ణ, కంబాల మామజీ, అడబాల బాబు పాల్గొన్నారు. నేటి నుంచి రిలే దీక్షలకు సన్నాహాలు 14 నెలలుగా సొమ్ములు ఇవ్వకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందరని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ‘కానీ కానీ అన్నారు.. కాసుల ఊసు మరిచారు’ శీర్షికన ఈ నెల 15న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని కాంట్రాక్టర్లు మునిసిపల్ కమిషనర్ పి.రమేష్, ఇతర అధికారులకు చూపించారు. మా కష్టాలు ఇలా ఉన్నాయి.. చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సొమ్ములు వచ్చే వరకూ ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. మునిసిపల్ కార్యాలయం వద్ద శనివారం నుంచి రిలే దీక్షలు చేస్తామని అనుమతి ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. కాంట్రాక్టర్లు మాట్లాడుతూ సొమ్ములు ఇచ్చే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సరైన సమాధానం రావడంలేదని, శనివారం నుంచి ఆందోళనకు దిగుతామని చెప్పారు.