పుష్కరాలకు 15 వేల మంది పోలీసులు
నాగార్జునసాగర్: కృష్ణా పుష్కరాలకు 15 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని సాగర్జలాశయం, కృష్ణానది తీరాల వెంట చేపట్టిన పుష్కరఘాట్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం నాగార్జునసాగర్‌లో డీఐజీ విలేకరులతో మాట్లాడారు.
ఘాట్ల వద్ద 24గంటలపాటు పోలీస్ యంత్రాంగం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని ఘాట్ల నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యేలా వేగవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.