దక్షిణాఫ్రికాపై జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో జింబాబ్వే బౌలర్ ఉత్సేయ హాట్రిక్ సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీకాక్, రూసో, మిల్లర్ లను ఉత్సేయ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఉత్సేయ ఐదు వికెట్లు సాధించడంతో దక్షిణాఫ్రికా జట్టు 231 పరుగులకు ఆలౌటైంది.
ఓదశలో ఒక వికెట్ కోల్పోయి 142 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికాను ఉత్సేయ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్ లో ఆమ్లా 66, డీకాక్ 76 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో న్యూంబు 3, చటారా 2 వికెట్లు పడగొట్టారు.