puttamraju kandrika
-
చంద్రబాబుతో భేటీ అయిన సచిన్
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ రమేష్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రిని సచిన్ కలిశారు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తన దత్తత గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎంకు సచిన్ వివరించినట్లు సమాచారం. సచిన్ నెల్లూరు జిల్లాలోని మైన పుట్టంరాజువారి కండ్రిగగ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. -
దత్తత గ్రామంలోసచిన్ పర్యటన
-
సచిన్ పీఏను అడ్డుకున్న పోలీసులు
నెల్లూరు: పుట్టంరాజు వారి కండ్రిగ వెళ్తున్న సచిన్ పీఏ మనోజ్ తివారీని గూడూరు వద్ద పోలీసులు ఆపేశారు. తాను సచిన్ పీఏ అంటూ మనోజ్ పోలీసులకు విన్నవించుకున్నాడు. అయినా పోలీసులు ఖాతరు చేయలేదు. ఈ ఘటనను సాక్షి విలేకర్లు చిత్రీకరిస్తుండగా ఎస్సై అంకమ్మరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్దతి కాదంటూ సాక్షి విలేకర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో సాక్షి విలేకర్లకు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సచిన్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ ఆదివారం ఆ గ్రామంలో పర్యటించనున్నారు. దాంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.