కొత్త ఓటర్లకు ఉచితంగా పీవీసీ కార్డులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల సంఘం నూ తనంగా ప్రవేశపెట్టిన పీవీసీ ఓటరు గుర్తింపు కార్డు జిల్లాలోని కొత్త ఓటర్లందరూ పొందవచ్చు. అయితే ప్రతి ఓటరు రూ. 25 చెల్లించి మీ సేవ కేంద్రాల ద్వారా కార్డును పొందేం దుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. జిల్లాలో 15-01-2013 నుంచి 31-01-2014 మధ్య కాలంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారిని కొత్త ఓటర్లుగా గుర్తించి వారందరికీ పీవీసీ కార్డులు ఉచితంగా అందజేయనున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా మొ త్తం కొత్త ఓటర్లు 2,07,407 మంది ఉన్నారు.
అయితే జిల్లా ఎన్నికల కార్యాలయానికి వచ్చిన పీవీసీ కార్డులను త్వరలో ఆయా నియోజకవర్గాలకు చేరవేసి బీఎల్ఓల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, 15-01-2014 కన్నా ముందు ఓటర్ల జాబితాలో నమోదైన వారు కొత్తగా పీవీసీ గుర్తింపు కార్డును మీసేవ కేం ద్రాల నుంచి పొందాల్సి ఉంటుంది. ఇం దు కు సంబంధించి ప్రభుత్వం హెచ్‌సీఎల్, సీఎంఎస్, ఏపీ ఆన్లైన్ సంస్థలతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది.
కాగా, పీవీసీ కార్డుల ప్రింటింగ్ కోసం రూ. 47500 లు వె చ్చించి కొందరు మీసేవ నిర్వాహకులు ప్రిం టర్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నా రు. ఇదిలా ఉండగా, పీవీసీ కార్డుపై ఫొటో, ఇతర సమాచారం ఉంచకుండా కేవలం ఎన్నికల సంఘం గుర్తింపును కల్పిస్తుండడం గమనార్హం. కాగా, పీవీసీ కార్డుల జారీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు గురువారం హన్మకొండ నక్కలగుట్టలోని ఈ సేవ కేం ద్రంలో లాంఛనంగా ప్రారంభించారు.