తప్పుదోవ పట్టించొద్దు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్స్ కు ఇంజనీర్ల జేఏసీ హితవు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో డిజైన్ల మార్పు కారణంగా రూ. వేల కోట్లు ప్రజాధనం వృథా అయిందని దీనికి ఇంజనీర్లను బాధ్యులను చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స ప్రకటనను రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ తప్పుపట్టింది. నిజాల్ని తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించరాదని ఇంజ నీర్ల జేఏసీ సూచించింది. విభజన అనం తర పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా ప్రకటనలు చేశారని ఆరోపించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పి.వెంకటేశం, కో చైర్మన్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్‌లు బుధవారం ప్రక టన విడుదల చేశారు.
ప్రాణహిత చేవెళ్ల లోని తమ్మిడిహెట్టి వద్ద నిర్ణీత నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం తేల్చిచెప్పడం, బ్యారేజీ ఎత్తును తగ్గించిన కారణంగానే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఆయ కట్టుకు నీరు అందించనుండగా కాళేశ్వరం ద్వారా గతంలో నిర్ణరుుంచిన ఆయకట్టు కంటే ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించవచ్చునన్నారు.