మెయిన్ ‘డ్రా’కు సోమ్‌దేవ్
చెన్నై: గత సీజన్లో నిలకడలేని ఆటతీరుతో నిరాశపరిచిన భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఈ ఏడాదిలో శుభారంభం చేశాడు. చెన్నై ఓపెన్‌లో సోమ్‌దేవ్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 2-6, 7-5, 6-4తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై గెలుపొందాడు. మరోవైపు భారత్‌కే చెందిన సాకేత్ మైనేని, శ్రీరామ్ బాలాజీలకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో తెలుగు ప్లేయర్ సాకేత్ 4-6, 2-6తో థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో; శ్రీరామ్ బాలాజీ 6-7 (2/7), 6-7 (0/7)తో పావిక్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయారు.