నాణ్యత సంగతేంటి?
బి.కొత్తకోట, న్యూస్‌లైన్ : హంద్రీ- నీవా సుజల స్రవంతి సాగు, తాగునీటి పథకం ప్రాజెక్టు పనుల నాణ్యతను ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతం లో నాణ్యతను పరిశీలించేందుకు మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నియమించిన థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్‌సెల్ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దుచేయడం ఆ విమర్శలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తొలివిడతగా రూ.2,774 కోట్లతో, చి త్తూరు, అనంతపురం జిల్లాల్లో రెండో విడతగా రూ.4,076 కోట్లతో ప్రాజెక్టు పనులుచేపట్టారు. ఇందులో మొదటి వి డతలో 90 శాతం, రెండో విడతలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. రెండో విడత పనుల్లో నాణ్యతపై నిర్లక్ష్యం చేయకూడదని ప్రభుత్వం భావించింది. దీనిపై చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 2006 తర్వాత మూడు క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీలను నియమించింది.
మదనపల్లెలో ఒకటి, అనంతపురం జిల్లాలో రెండింటిని ఏర్పాటుచేసింది. థర్డ్‌పార్టీకి చెందిన సాంకేతిక నిపుణులు స్వయంగా పనులను సమీక్షించేవారు. మట్టిపనులతో పాటు, కాంక్రీటు నిర్మాణాలు, ఎతిపోతల పథకాలు, బ్రిడ్జి పనుల నాణ్యత, పనుల శాంపిల్స్‌ను సేకరించేవారు. మదనపల్లె, అనంతపురం జిల్లాల్లో ఏజెన్సీలు ప్రయివేటుగా ఏర్పాటుచేసుకున్న పరీక్షాకేంద్రాల్లో పరీక్షించేవారు. ఏ మేరకు నాణ్యతుం ది.. ఎంత పరిమాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. నాసిరకం పరిమాణమెంత అన్నది పరీక్షల అనంతరం నిర్ధారించి, సంబంధిత నివేదికను ప్రాజెక్టు ఉన్నతాధికారులకు అందజేసేవారు. థర్డ్‌పార్టీ ఇచ్చిన నాణ్యత ధ్రువీకరణ ఆధారంగా ప్రాజెక్టు అధికారులు బిల్లులచెల్లింపు, పనులను తిరిగి చేయించడం విషయంలో నిర్ణయాలు తీసుకునేవారు. శాంతాలా, వాస్, ఘ్రీజ్ కంపెనీలు థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ బాధ్యతలను నిర్వహించాయి. వీటికి గడచిన జూన్ వరకే గడువు ఉండడంతో అంతవరకే వీటి కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వీటి సేవలు అవసరంలేదని ఉత్వర్వులు జారీచేసింది. దీంతో ప్రాజెక్టు అధికారులు మదనపల్లెలోని నాణ్యతా పరీక్షాకేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని సామగ్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు. వీటిని కొనసాగించని కారణంగా ప్రభుత్వం పనులనాణ్యత పరీక్షించేందుకు ప్రాజెక్టు అధికారులను వినియోగించుకోవాలని సూచించింది.
వీటి నాణ్యత ఉన్నాలేకున్నా పరీక్షించేది బిల్లులుచేసే అధికారులే కాబట్టి విమర్శలురావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా చిత్తూరు జిల్లా పరిధిలో సాగుతున్న పనులనాణ్యతను పర్యవేక్షించేందుకు తెలుగుగంగ ప్రాజెక్టుకు చెందిన క్వాలిటీకంట్రోల్ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని మదనపల్లెకు తరలించారు. ఇందులో ఒక డీఈ, ఇద్దరు జేఈలు పనిచేస్తున్నారు.