తేనెటీగలతో మన‘సారా’..
ఈమె పేరు సారా మాపెలి. అమెరికాలోని ఓరెగాన్కు చెందిన ఈమెకు బీ క్వీన్ అని పేరు. ఫొటో చూడగానే మీకు తెలిసిపోతుంది కదూ.. అయితే.. ఇక్కడో ట్విస్టుంది. రంగురంగుల రవికలంటే.. మహిళలకు ఇష్టమే.. కానీ ఈమె వేసుకున్నది తేనెటీగల రవిక. అంటే.. 12 వేల తేనెటీగలు బ్లౌజ్ తరహాలో ఆమె నగ్న శరీరంపై ఉన్నాయన్నమాట. ఇలాంటి సాహసకృత్యాలు ఈమె చాలా చేస్తుంది. ఇవి శరీరంపై ఉన్నప్పుడు డాన్స్ కూడా చేస్తుంది. కుడతాయన్న భయం లేదా అంటే.. అవి తన దోస్తులంటుంది.