క్వీన్స్ టౌన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
క్వీన్స్ టౌన్: న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ ఎయిర్ పోర్టుకు ఆదివారం బాంబు బెదిరింపు రావడంతో అక్కడి భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్ పోర్టులోని కీలక విభాగాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రయాణీకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ పోర్టులోని రన్ వేపై ల్యాండయిన విమానంలో గుర్తు తెలియని వ్యక్తి ఉత్తరాన్ని వదిలి వెళ్లినట్లు చెప్పారు. ఇది గమనించిన క్లీనర్ ఉత్తరంలో విమానంలో బాంబు ఉంచినట్లు పేర్కొనడాన్ని గమనించి అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో హైఅలర్ట్ ప్రకటించిన ఎయిర్ పోర్టు అధికారులు భధ్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో విమానాన్ని జల్లెడ పట్టిన అధికారులు ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులోని మిగతా ప్రాంతాలను బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.