రేస్‌కోర్సులో లైంగిక వేధింపులు..
- మీడియాను ఆశ్రయించిన బాధితురాళ్లు
రాజమండ్రి
రేస్‌కోర్సులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను అక్కడ క్యాషియర్‌గా పని చేస్తున్న వ్యక్తి లైంగికంగా వేధిస్తుండటంతో.. విసిగిపోయిన ఉద్యోగినులు రోడ్డెక్కారు. హైదరాబాద్ మలక్‌పేట్ రేస్కోర్ట్కు అనుబంధ సంస్థ అయిన ‘క్వారియే రేస్కోర్ట్ రాజమండ్రి’లో క్యాషియర్‌గా పని చేస్తున్న రమేష్ బాబు అనే వ్యక్తి తమను లైగికంగా వేధిస్తున్నాడని రేస్‌కోర్సులో పని చేస్తున్న ఉద్యోగినులు మిడియాతో వాపోయారు. ఈ అంశంపై పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అందుకే ప్రజల దృష్టికి తీసుకురావడానికి మీడియాను ఆశ్రయించామని 20 మంది బాధితురాళ్లు మీడియాకు తెలిపారు.