టుస్సీ తుస్సీ గ్రేట్ హో!
చూడగానే ముద్దొచ్చేలా కనిపిస్తున్నారు కదూ ఈ బుల్లిబుల్లి చిన్నారులు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరు అందరికీ తెగ ముద్దొచ్చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన టుస్సీ ఈ ఏడాది జనవరిలో వీరికి జన్మనిచ్చింది. ఇది వీరికి తొలి ఫొటోషూట్. ఇందులో నలుగురు ఆడ శిశువులు.. ఒక మగశిశువు ఉన్నారు. ఒక్కరితో వేగడమే కష్టం.. అలాంటిది ఒకేసారి ఐదుగురిని చూసుకోవడమంటే.. ఊహించుకోండి. అందుకే నెటిజన్లు ఆ తల్లిని అంటున్నారు.. 'టుస్సీ తుస్సీ గ్రేట్ హో!' అని.