పోలీసుల అదుపులో చిట్టీల మోసగాడు!
నకిరేకల్ (నల్లగొండ): చిట్టీల పేరుతో కోటి రూపాయల మేర ప్రజల నుంచి వసూళ్లు చేసి పరారయిన వ్యక్తిని నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడి విచారిస్తున్నారు.
నకిరేకల్ మూసీ రోడ్డులో ఓ ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్న రాచకొండ శ్రీనివాస్ రూ.కోటి చిట్టీల మోసం కేసులో పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో కొందరు బాధితులు ఆదివారం స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.