raghavapur
-
సమోసాలో చిట్టెలుక.. అప్పటికే 130 సమోసాలు..!
సాక్షి, సిద్ధిపేట: ఓ హోటల్లో కొన్న సమోసాలో చనిపోయిన చిట్టెలుక బయటపడ్డ ఘటన సిద్దిపేటలోని రాఘవాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అధికం వెంకటస్వామి హోటల్లో సమోసాలు కొన్నాడు. తింటున్న క్రమంలో చనిపోయిన ఎలుక వచ్చింది. దీంతో వినియోగదారుడు హోటల్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరికొంతమంది గొడవకు దిగడంతో నిర్వాహకుడు మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడంతో గొడవ సర్దుమనిగింది. అప్పటీకే 130 సమోసాలు అమ్మినట్లు నిర్వాహకుడు తెలిపారు. చదవండి: వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే.. -
హైనా దాడిలో లేగ దూడ మృతి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : హైనా దాడిలో ఓ లేగదూడ మృతిచెందిన ఘటన మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాసగోని అశోక్ సోమవారం రాత్రి వ్యవసాబావి వద్ద ఉన్న పశువుల పాక పక్కన లేగదూడను కట్టేసి ఉంచాడు. కాగా మంగళవారం ఉదయం అశోక్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా లేగదూడ మృతిచెంది ఉంది. ఆనవాళ్లను బట్టి తన లేగదూడ హైనాదాడితోనే మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. -
విద్యార్థిని మృతి
సిద్దిపేట రూరల్: అనారోగ్యంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. రాఘవాపూర్ గ్రామానికి చెందిన రేణిగుంట పద్మ, సత్తయ్యల రెండో కుమార్తె మానస (17) సిద్దిపేట పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగానే సోమవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మానసకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబీకులు తగ్గుతాయని అనుకుని ఇంటి వద్దే ఉంచారు. మంగళవారం ఉదయం మరింత ఎక్కువ కావడంతో వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాత్రి మృతి చెందింది. మానస తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.