శ్రీసిటీని సందర్శించిన తైవాన్ పారిశ్రామిక బృందం
సత్యవేడు (చిత్తూరు): తైవాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చర్స్ అసోసియేషన్( టీమా) అధ్యక్షుడు ఫ్రాన్సిస్ సయ్ ఆధ్వర్యంలో 20 మంది ప్రతినిధులు శ్రీసిటీకి వచ్చారు.
సెజ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాగిణి పీటర్ మౌలిక వసతుల గురించి వివరించారు. శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే చేయడానికి వచ్చినట్లు బృందం సభ్యులు తెలిపారు.