భారత్తో సిరీస్లో డీఆర్ఎస్ లేదు: బీసీబీ
ఢాకా : స్వదేశంలో భారత్తో జరగనున్న సిరీస్కు అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ని ఉపయోగించడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. రెండు దేశాల బోర్డుల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘ఇటీవల పాక్తో జరిగిన సిరీస్లో అంపైర్ రిఫరల్ పద్ధతిని వినియోగించాం. కానీ ఇప్పుడు అది కూడా లేదు. డీఆర్ఎస్పై బీసీసీఐకి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇందులో దేన్నీ ఉపయోగించడం లేదు.
ఇప్పటి వరకు భారత్తో ఆడిన ఏ జట్టైనా డీఆర్ఎస్ను వాడలేదు. మేం కూడా అదే దారిలో వెళ్తున్నాం’ అని హసన్ పేర్కొన్నారు. మరోవైపు వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని తమ వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ భారత్తో టెస్టులో వికెట్ కీపింగ్ చేసే అవకాశం లేదని హసన్ వెల్లడించారు. అనాముల్ హక్, లిట్టన్ దాస్లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.