రైళ్లలోనూ సీరియల్స్ చూడొచ్చు!
న్యూఢిల్లీ: అత్యాధునిక మార్పులకు శ్రీకారం చుడుతున్న ఇండియన్ రైల్వేస్.. ప్రయాణికుల అభిరుచులకు తగినట్లుగా సకల సర్వీసులను అందించే ప్రయత్నం చేస్తోంది. ప్రయాణం కారణంగా టీవీ సీరియల్స్ చూడలేకపోయామనే బెంగ లేకుండా.. రైల్వే స్టేషన్లు, బోగీల్లోనే ప్రసారాలు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలు వేస్తోంది.
వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ లాంటి టెలీకం దిగ్గజాల ద్వారా రైల్ రేడియో సర్వీసెస్, కంటెంట్ ఆన్ డిమాండ్‌ను అందుబాటులో తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్ ఆధారంగా టీవీ సీరియళ్లు, సినిమాలు, షార్ట్ వీడియోలు, చిన్న పిల్లల ప్రోగ్రామ్‌లు ప్రసారం అయ్యేలా కసరత్తు మొదలుపెట్టినట్లు బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వెల్లడించింది.