‘గ్యాప్ ఫిల్లర్’తో ప్రమాదాలకు చెక్
సాక్షి, ముంబై: లోకల్ రైలు-ప్లాట్ఫారం మధ్యనున్న ఖాళీ స్థలంలో నుంచి కిందపడి అనేక మంది ప్రా ణాలు, మరికొందరు కాళ్లు, చేతులు పొగొట్టుకుం టున్నారు. ఇలాంటి సంఘటనలకు అరికట్టేందుకు రైల్వే పరిపాలన విభాగం తమ వంతుగా చేస్తున్న ప్రయత్నాలు అనుకున్నంత మేర ఫలితాలను ఇవ్వ డం లేదు. దీంతో వీటికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టేం దుకు ముంబైలోని ఐఐటీకి చెందిన ‘ఇండియన్ డిజైనర్ సెంటర్’ విద్యార్థులు ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.
‘ర బ్రీ ప్లాట్ఫారం గ్యాప్ ఫిల్లర్స్’ పేరిట రబ్బరుతో పరికరాన్ని తయారుచేశారు. అం దుకు సంబంధించిన నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని నిర్దేశిత స్టేషన్లలో ముందుగా ఏర్పాటు చేస్తారు. మంచి ఫలితాలు వస్తే అన్ని స్టేషన్లలో, అన్ని ప్లాట్‌ఫారాలపై ఈ రబ్బ రు పరికరాన్ని ఏర్పాటు చేస్తారని దీన్ని తయారుచేసిన అరుణ్‌రాజ్ అనే విద్యార్థి చెప్పారు. దీనివల్ల ప్లాట్ఫారం-లోకల్ రైలు బోగీ మధ్యలో ఉండే ఖాళీ స్థలం ఈ రబ్బరు పరికరం ద్వారా పూర్తిగా మూసుకుపోతుంది.
రైలు ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో అదుపుతప్పి ప్రయాణికులు కిందపడే అవకాశముండదని ఇండియన్ డిజైనర్ సెంటర్ విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ముంబై లోకల్ రైళ్లలో ప్రతీరోజు దాదాపు 75 లక్షల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా ఈ రైళ్లు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో తోపులాటలు పరిపాటే. ఈ గందరగోళంలో అదుపుతప్పి ఖాళీ స్థలంలోంచి ప్రయాణికులు కిందపడుతున్నారు.
ఇందులో కొందరి ప్రాణాలు పోగా, మరికొందరు తమ అవయవాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు రాసేందుకు వెళుతున్న ఓ విద్యార్థిని, ఉద్యోగానికి వెళుతున్న ఓ యువతి, మరో మహిళ ఇలాగే కిందపడి చేతులు పొగొట్టుకున్నారు. ఆ సమయంలో ఈ ఘటనలు స్థానికంగా సంచలనం సృష్టించాయి. ఇలాంటి సంఘటనలు ప్రతీరోజు నగరంలో ఏదో ఒక స్టేషన్లో జరుగుతూనే ఉంటాయి.
ప్లాట్ఫారం-రైలు మధ్యలో 20- 25 ఇంచ్‌ల ఖాళీ స్థలం ఉంటుంది. ఇందులో నుంచి మనిషి సులభంగా కింద పడిపోతాడు. ఈ ఖాళీ లేకుండా చేయాలని తలంచి 24 స్టేషన్లలో ఐఐటీ విద్యార్థులు అధ్యయనం చేశారు. చివరకు రబ్బరుతో పరికరాన్ని తయారుచేశారు. త్వరలో కొన్ని కీలకమైన స్టేషన్లలో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా బిగిస్తామని ఇండియన్ డిజైనర్ సెంటర్ విద్యార్థులు తెలిపారు.