యువకుడు దుర్మరణం
రాయదుర్గంటౌన్/ రూరల్ : పట్టణంలోని బీటీపీ రోడ్డు రైల్వే గేటు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. రాయదుర్గంలోని చర్చి ఏరియాలో నివాసముంటున్న గొల్ల భాస్కర్ (34) రాజీవ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న తన బావమరిది బేల్దారి గొల్ల సుధాకర్‌తో కలిసి గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరి వెళ్ళాడు. రైల్వే గేటు దాటిన తరువాత రోడ్డుపై కుక్క అడ్డుగా రావడతో అదుపు తప్పి కిందపడ్డారు. తీవ్రగాయాలతో ఉన్న ఇద్దరినీ రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే భాస్కర్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.