railway police told
-
అక్కా! అమ్మా,నాన్నను బాగా చూసుకో
సాక్షి,చిత్తూరు (కురబలకోట): అక్కా! అమ్మా..నాన్నను బాగా చూసుకో..–ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వ్యక్తి తన సోదరికి పంపిన సందేశం. రైల్వే పోలీసుల కథనం..మదనపల్లెలోని బయ్యారెడ్డి కాలనీకి చెందిన చిన్న వెంకట్రమణ కుమారుడు ఆర్.సుభాష్(27) డెహ్రాడూన్లోని సోలార్ ప్లాంట్లో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. క్యాన్సర్తో బాధపడుతున్న అతని తల్లి లక్ష్మీదేవి (53) బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వ్యాధి ముదిరిందని అక్కడి డాక్టర్లు చెప్పారు. బుధవారం మళ్లీ బెంగళూరుకు తల్లిని తీసుకెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ నుంచి సుభాష్ విమానంలో సోమవారం రాత్రి బెంగళూరు చేరారు. మదనపల్లె బస్టాండు చేరుకుని రాత్రి కడప బస్సు ఎక్కాడు. గుర్రంకొండకు టికెట్ తీసుకుని మార్గమధ్యంలోని కురబలకోట రైల్వేగేటు వద్ద దిగేశాడు. మంగళవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో తన అక్క శాంభవికి ఫోన్ చేశాడు. తాను కురబలకోట రైల్వేస్టేషన్ వద్ద ఉన్నానని అమ్మా..నాన్నను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఉదయం చూస్తే రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై శవమై కన్పించాడు. తొలుత గుర్తు తెలియని శవంగా భావించారు. సంఘటన స్థలంలో లభించిన సెల్ఫోన్ ఆధారంగా మృతుడిని గుర్తించారు.రైలు ఇతనిపై వెళ్లడంతో తల మొండెం వేరైంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, తల్లికి కాన్సర్ నయం కాదన్న మనోవేదనతో ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మృతుని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డెహ్రాడూన్లో ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. -
వేర్వేరు రైలు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఏలూరు అర్బ : జిల్లాలో జరిగిన వేర్వేరు రైలు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేఘాలయలో పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎ.బి.నాయక్ (50) విజయవాడ నుంచి వైజాగ్ Ðð వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో రైలు నూజివీడు స్టేష¯ŒS చేరుకునే సరికి సోమవారం రాత్రి కంపార్ట్మెంట్ గుమ్మంలో నిలబడిన అతను ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ ఎ¯ŒS.రాము ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు వద్ద.. రాజమండ్రి నుంచి ఏలూరు వస్తున్న మరో యువకుడు భీమడోలు రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. స్థానిక వెంకటాపురం పంచాయితీ నెహ్రూనగర్–2కు చెందిన దుప్పాల హేమారావు (20) అనే యువకుడు మూడు రోజుల కిందట కుటుంబ పనులపై రాజమండ్రి వెళ్లాడు. తిరిగి ఏలూరు వచ్చేందుకు మంగళవారం రైలు ఎక్కాడు. రైలు భీమడోలు స్టేష¯ŒS చేరుకునే సరికి హేమారావు రైలు నుంచి జారి పట్టాలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.జాన్స¯ŒS ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది. భీమడోలు జ్యూట్మిల్ వంతెన సమీపంలో పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.జాన్స¯ŒS ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను విచారించినా ఫలితం లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని శరీరంపై నిలువు నీలం చారల పసుపురంగు చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ఉన్నాయని హెచ్సీ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.