గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
కొత్తగూడెం: గోదావరి పుష్కరాలకు ప్రయూణికుల సౌకర్యార్థం ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు రైల్వే జీఎం శ్రీవాత్సవ తెలి పారు శుక్రవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్‌కు వచ్చి తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్‌కు ఆర్టీసీ బస్సులు వచ్చివెళ్లే విధం గా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు ప్రయూణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రైళ్ల రాకపోకలు ఎక్కువగా అవకాశం ఉన్న నేపథ్యంలో మూడో ప్లాట్‌ఫామ్‌నూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైళ్లు, బస్సుల వివరాలు తెలియజేస్తామన్నారు. తొలుత రైల్వేస్టేషన్లో జీఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్, సోలార్‌పవర్‌ప్లాంట్, కమ్యూనిటీహాల్‌ను ప్రారంభించారు. రైల్వేఆస్పత్రిలో వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే, పార్లమెంట్ కార్యదర్శి జలగం వెంకట్రావ్ రైల్వేజీఎంను కలిశారు