భూదందా ఆపండి
రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా
మచిలీపట్నం (చిలకలపూడి) :
విదేశీ కంపెనీల కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న భూదందా ప్రయత్నాలను ఆపాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి యద్దనపూడి సోనీ డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.
ఆయన మాట్లడుతూ విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని పెంచేందుకు ఎంఏడీఏను ఏర్పాటు చేశారన్నారు. మచిలీపట్నం అభివృద్ధి పేరుతో ఎంఏడీఏ ద్వారా 1.05 లక్షల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని విమర్శించారు. రైతుకూలీ సంఘం నాయకులు ఎం. రాంబాబు, యు. వీరబాబు, సిటీ బస్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు డి. కామేశ్వరరావు పాల్గొన్నారు.