నేడు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిశ్శబ్ద విప్లవం
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ చేపడుతున్న సమైక్య ఆందోళనల్లో భాగంగా బుధవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రాజ్‌విహార్ సెంటర్లో నిశ్శబ్ద విప్లవం పేరుతో మౌన వ్రతం పాటిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు భానుచరణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఇర్షాద్, కార్యదర్శి ఈడిగ బుద్ధిరాజ్ గౌడ్, కోశాధికారి జె.విజయుడు సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
శాంతియుత మార్గంలో పర్యావరణానికి నష్టం కలగకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు మౌన వ్రతం చేపడుతున్నామన్నారు. రోడ్లపైన టైర్లు కాల్చడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు ఆందోళనలో పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు.