మమ్ముట్టి నుంచి నేర్చుకుంటున్నా
సంచలనాలకు మారుపేరు లక్ష్మీరాయ్ అనవచ్చు. ఇటీవల తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకుని వార్తల్లో కెక్కిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం వంటి దక్షిణాది భాషలన్నింటి లోను నటిస్తూ బిజీగా వున్నారు. తమిళంలో అరణ్మణై, ఇరుంబు కోట్టై చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు మలయాళంలో మోహన్‌లాల్ సరసన పి.మాధవన్ నాయిరుం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
తాజాగా మమ్ముట్టితో జత కడుతున్నారు. రాజా ది రాజా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. గ్లామరస్ పాత్రల నుంచి కుటుంబ కథా పాత్రల వరకు ఎన్నో చిత్రాలలో నటించిన రాయ్‌లక్ష్మి రాజా ది రాజాలో ఇంతవరకు పోషించనటువంటి పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రం కోసం లండన్ నుంచి నేరుగా పొల్లాచ్చి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, మమ్ముట్టితో నటించడం సరికొత్త అనుభవం అంటున్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు.